గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (14:44 IST)

క్రికెట్‌లో అత్యంత అరుదైన రికార్డును నెలకొల్పిన క్రికెటర్!!

Rashid Khan
ఆప్ఘనిస్థాన్‌ దేశానికి చెందిన క్రికెటర్ రషీద్ ఖాన్ అత్యంత అరుదైన రికార్డును నెలకొల్పాడు. పొట్టి ఫార్మెట్ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా వరవల్డ్ రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఎస్ఏ20 లీగ్ ఎంఐ కేప్‌టౌన్ జట్టు తరపున ఆడుతున్న రషీద్.. పార్ల్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు. 
 
దీంతో అతడి ఖాతాలో (అంతర్జాతీయ టీ20లు, లీవ్‌లు కలిపి) మొత్తం 633 వికెట్లు వచ్చి చేరాయి. వీటిలో ఆఫ్ఘనిస్థాన్ తరపున పడగొట్టిన 161 వికెట్లు, దేశవాళీతోపాటు వివిధ లీగ్ మ్యాచుల్లో తీసిన 472 వికెట్లు ఉన్నాయి.
 
రషీద్ ఖాన్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడాడు. కాగా, టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో రెండో స్థానంలో ఉన్నాడు. బ్రావో 582 మ్యాచ్‌లలో 631 వికెట్లు తీశాడు.