గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 10 మే 2017 (12:22 IST)

సచిన్ బయోపిక్ విడుదలకు వేళాయె.. ప్రమోషన్‌లో క్రికెట్ గాడ్ బిజీ బిజీ

క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్ సినిమా మే 26న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. తన గురించి చాలా విషయాలు తెలుసని అభిమానులు భావిస్తుంటారని... కాన

క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్ సినిమా మే 26న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. తన గురించి చాలా విషయాలు తెలుసని అభిమానులు భావిస్తుంటారని... కానీ, అభిమానులకు తెలియని విషయాలు చాలా ఉన్నాయన్నారు. అందుకే తన జీవిత కథతో తెరకెక్కుతున్న 'సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్' చిత్రం ద్వారా వారికి దగ్గర అవ్వాలనుకుంటున్నానని తెలిపారు. 
 
బయోపిక్ సినిమా ద్వారా సచిన్ కొత్తగా కనిపిస్తాడని, తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెరపై చూసుకోనుండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాలో సచిన్‌కు సంబంధించిన కొన్ని పర్సనల్ వీడియోలను కూడా చూపించనున్నారు. ఈ చిత్రం ప్రమోషన్‌లో మాస్టర్ బిజీ బిజీగా ఉన్నారు.

సచిన్ బయోపిక్‌పై పలువురు సెలెబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో దేశానికి జాతీయ గీతంలా.. మాస్టర్ బయోపిక్ ''సచిన్ యాంతమ్'' అంటూ ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్ రెహమాన్ ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన పాటను కూడా ఆయన రిలీజ్ చేశారు.