బుధవారం, 8 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 సెప్టెంబరు 2025 (14:01 IST)

Cobra drinking water: కుళాయిలో నీరు తాగుతున్న నాగుపాము (video)

Snake
Snake
సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ నాగుపాముకు చెందిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ నాగుపాము కుళాయిలో వచ్చే నీటిని తాగుతోంది. ఆ నీటిని తాగేటప్పుడు తనను ఎవ్వరూ డిస్టబ్ చేయొద్దని చెప్తున్నట్లు బుసలు కొడుతోంది. 
 
హ్యాపీగా కుళాయి నీటిలో తడుస్తూ.. నాలుకతో నీరు తాగుతూ.. ఎవరైనా ఏమన్నా చేస్తారనే భయంతో మధ్య మధ్యలో బుసలు కొడుతూ ఆ పాము కనిపించింది. ఈ వీడియోను చూసిన వారంతా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.