గురువారం, 16 అక్టోబరు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 సెప్టెంబరు 2025 (11:00 IST)

Sachin Tendulkar: బీసీసీఐ అధ్యక్షుడి రేసులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్?

Sachin
Sachin
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు అరుదైన పదవి దక్కనుంది. బీసీసీఐ అధ్యక్షుడి రేసులో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా రోజన్ బిన్నీ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో.. కొత్త అధ్యక్షుడి కోసం బీసీసీఐ ఎన్నిక నిర్వహించనుంది. 
 
ఈ క్రమంలో బీసీసీఐ బోర్డు సభ్యులు సచిన్ నియామకంపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ వార్తలను సచిన్ టెండూల్కర్ కార్యాలయం ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంది. బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో సచిన్ టెండూల్కర్ ఉన్నారనే వార్తలను సచిన్ కార్యాలయం తోసిపుచ్చింది. 
 
బీసీసీఐలోని ఏ పదవిపై సచిన్ టెండూల్కర్‌కు ఆసక్తి లేదు. నిరాధారమైన ఊహాగానాలకు ప్రాధాన్యత ఇవ్వద్దని అందర్నీ కోరుతున్నామని టెండూల్కర్‌కు చెందిన ఎస్‌ఆర్‌టీ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ ప్రకటనలో తెలిపింది.