Arjun and Sara Tendulkar: అర్జున్ టెండూల్కర్‌కు నిశ్చితార్థం.. సారా-గిల్ ప్రేమాయణం వల్లే?
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. 25 ఏళ్ల అర్జున్ టెండూల్కర్‌కు ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనువరాలు సానియా చందోక్‌తో సీక్రెట్‌గా నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి.
అక్క సారా టెండూల్కర్ పెళ్లి కాకుండానే అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. సచిన్ కూడా కూతురు పెళ్లి కాకుండానే కొడుకు పెళ్లి చేయడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే సారా టెండూల్కర్ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పడంతో సచిన్ కుంటుంబం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ప్రస్తుతం మోడలింగ్ చేస్తున్న సారా టెండూల్కర్.. ఇటీవలే ఆస్ట్రేలియా టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఎంపికైంది. శుభ్‌మన్ గిల్‌తో ప్రేమాయణం కూడా సారా టెండూల్కర్ పెళ్లి చేసుకోకపోవడానికి ఓ కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ఈ జోడీ ఇప్పటి వరకు అధికారికంగా తమ రిలేషన్ గురించి ప్రకటించలేదు.