మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 7 మే 2018 (10:35 IST)

హసీన్ జహాన్.. షమీ సొంతూరికి ఎందుకెళ్లింది.. ఇంటి తాళాన్ని పగులకొట్టాలని?

టీమిండియా క్రికెటర్ షమీ భార్య హసీన్ జహాన్ మళ్లీ రచ్చ రచ్చ చేసింది. ఈసారి మీడియా ముందుకొచ్చి షమీ కుటుంబీకులపై ఆరోపణలు చేయడం కాకుండా.. షమీ సొంత ఊరైన యూపీలోని సహస్ గ్రామానికి వెళ్లింది. అక్కడికెళ్లి.. స్

టీమిండియా క్రికెటర్ షమీ భార్య హసీన్ జహాన్ మళ్లీ రచ్చ రచ్చ చేసింది. ఈసారి మీడియా ముందుకొచ్చి షమీ కుటుంబీకులపై ఆరోపణలు చేయడం కాకుండా.. షమీ సొంత ఊరైన యూపీలోని సహస్ గ్రామానికి వెళ్లింది. అక్కడికెళ్లి.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో తనకు రక్షణ కావాలని పోలీసులను కోరింది. అంతేగాకుండా.. షమీ ఇంటి తాళాన్ని పగలగొట్టాలని డిమాండ్ చేసింది. 
 
కానీ హసీన్ జహాన్ డిమాండ్‌ను పోలీసులు తిరస్కరించారు. ఆ ఇంట్లో ఎవరూ లేరని, ఎవ్వరూ లేని సమయంలో తాళం పగులకొట్టడం చట్ట విరుద్ధమని హసీన్‌కు తేల్చి చెప్పారు. ఈ ఘటన షమీ బంధువు మొహమ్మద్ జమీర్ స్పందిస్తూ.. ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండానే హసీన్ తమ గ్రామానికి వచ్చిందని చెప్పారు. అయినా ఆమెను తమ ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించానని తెలిపాడు. అయితే హసీన్ షమీ స్వగ్రామానికి ఎందుకు వెళ్లిందనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు.