గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 జనవరి 2024 (14:35 IST)

అర్జున అవార్డును స్వీకరించిన మహ్మద్ షమీ

shami
భారత క్రికెటర్‌‌‌ మహ్మద్ షమీ అర్జున అవార్డును స్వీకరించారు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమీ అర్జున అవార్డు స్వీకరించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నేడు క్రీడా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి షమీ, ఇతర క్రీడాకారులు హాజరయ్యారు. షమీకి అర్జునుడి ప్రతిమ, ప్రశంసాపత్రం అందజేశాడు. మహ్మద్ షమీకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. అయితే, అక్కడి క్రికెట్ సంఘం రాజకీయాలతో విసిగిపోయి వెశ్చిమ బెంగాల్‌కు తరలి వెళ్ళాడు. బెంగాల్‌లో తరపున రంజీల్లో సత్తా చాటి టీమిండియా తలపుపుట్టాడు. 
 
కాగా భారత తరపున అంతర్జాతీయంగా సత్తా చాటిన అత్యంత ప్రతిభావంతులైన పేసర్లలో మహ్మద్ షమీ ఒకరిగా గుర్తింపు పొందిన విషయం తెల్సిందే. ఇటీవల వరల్డ్ కప్‌లో మహ్మద్ షమీ అత్యుత్తమ ప్రదర్శన చేసిన విషయం తెల్సిందే. పేస్, స్వింగ్ నైపుణ్యాలకు అద్దం పడుతుంది. ఎప్పటి నుంచే టీమిండియాకు షమీ ప్రధాన బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం షమీకి అర్జున అవార్డును అందజేశారు.
 
కాగా, 33 యేళ్ళ షమీ ఇప్పటివరకు 64 టెస్టుల్లో 229 వికెట్లు, 101 వన్డేల్లో 195 వికెట్లు, 23 అంతర్జాతీయ టీ20ల్లో 24 వికెట్లు తీశాడు. దేశవాళీల్లో 88 మ్యాచ్‌ల్లో 332 వికెట్లు సొంతం చేసుకున్నాడు.