శుభమన్ గిల్‌తో లవ్వులో వున్న సారా టెండూల్కర్..?
లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) బ్యాట్స్‌మెన్ అయిన శుభమన్ గిల్‌తో డేటింగ్ చేస్తున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఆ వదంతులపై ఇప్పటి వరకు ఎవరూ కూడా స్పందించలేదు. కానీ, వీటికి బలం చేకూర్చేలా వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరిని మరొకరు ఫాలో అవుతున్నారు.
ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యనే బాల్కనీలో నిల్చొని ఉన్న ఫొటోను ఆమె పోస్ట్ చేసింది. పట్టణంలోనే అన్ని నవ్వులున్నాయనే క్యాప్షన్‌ను ఆ ఫొటోకు జత చేసింది.
అభిమానులు కూడా ఆ ఫొటోకు స్పందించారు. అనుకోని అతిథులుగా బాలీవుడ్ నుంచి కార్తిక్ ఆర్యన్, అర్మాన్ మాలిక్ కూడా ఆ ఫొటోకు కామెంట్ చేశారు. ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఆమె పాఠశాల విద్యను పూర్తి చేసింది. ప్రస్తుతం లండన్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తోంది.