ధోనీ బ్యాటింగ్‌ను తప్పు పట్టాల్సిన పనేమీ లేదు (video)
ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన ప్రపంచ కప్‌లో భాగంగా టీమిండియా బ్యాటింగ్‌పై విమర్శలొచ్చాయి. ముఖ్యంగా ధోనీ-కేదార్ జాదవ్‌ల మధ్య నెలకొన్న భాగస్వామ్యం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించడం పెను దుమారానికి దారి తీసింది. వీళ్లిద్దరూ తమ సహజ సిద్ధ శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేశారని అంటూ సచిన్ కామెంట్స్ చేశారు.
ఈ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ధోనీకి పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశాలు కూడా రాలేదు. ఐదు మ్యాచుల్లో ఒకటి నీళ్లపాలు కాగా.. నాలుగింట్లో టీమిండియా విజయం సాధించింది. ఈ నాలుగు మ్యాచ్‌లను కలిపి ధోనీ చేసింది 90 పరుగులే.
ఈ నేపథ్యంలో ధోనీపై సచిన్ కామెంట్స్ చేయడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. ధోనీ తన సహజ శైలికి భిన్నంగా ఆడాడని, అతని బ్యాటింగ్ తీరు తనను తీవ్ర నిరాశకు గురి చేసిందంటూ సచిన్ టెండుల్కర్ సైతం విమర్శలు ఎక్కుపెట్టారు. ఇప్పటికే సచిన్‌పై ధోనీ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలెట్టారు.
ఈ నేపథ్యంలో ధోనీకి టీమిండియా మాజీ కేప్టెన్ సౌరబ్ గంగూలీ ధోనీకి మద్దతుగా నిలిచాడు. ఆయన బ్యాటింగ్‌ను తప్పు పట్టాల్సిన పనేమీ లేదంటూ ఎదురుదాడికి దిగారు. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక్క ఇన్నింగ్‌తోనే ధోనీని తప్పు పట్టే అర్హత ఎవరికీ లేదని చెప్పారు. ధోనీ ఎలాంటి బ్యాట్స్‌మెన్ అనేది అందరికీ తెలుసని, ఇప్పుడు కొత్తగా ఆయన తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఆప్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌ను ఎదుర్కొన్నప్పుడు ధోనీ ఎలా ఆడారో అందరూ చూశారని, అలాంటప్పుడు ఆయనను ఎలా విమర్శించగలుగుతారని గంగూలీ నిలదీశారు.