శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 25 జూన్ 2019 (13:13 IST)

భారత్‌ చేతిలో ఓటమి.. ఆత్మహత్యకు ప్రేరేపించింది...

ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా ఈనెల 16వ తేదీన భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించినప్పటికీ... చివరకు విజయం మాత్రం భారత్‌నే వరించింది. ఈ పరాజయంతో పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై అనేక విమర్శలు చెలరేగాయి. 
 
ఈ ఓటమిపై పాకిస్థాన్ క్రికెట్ కోచ్ మిక్కీ ఆర్థర్ స్పందిస్తూ, ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు ఓటమి పాలయ్యాక ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందన్నారు. పాక్ ఓటమి తనను తీవ్రంగా బాధించిందని, గత ఆదివారం ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కూడా వచ్చిందన్నాడు. 
 
ప్రపంచకప్‌లో ఓటములు ఎదురైతే ఒత్తిడి తీవ్రంగా ఉంటుందన్నారు. ఆ మ్యాచ్‌లో ఫఖార్ జమాన్, ఇమాముల్ హక్‌లు మంచి ఆరంభాన్ని ఇచ్చినా, వారు ఔటయ్యాక ఆందోళన మొదలైందన్నాడు. వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతే ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నాడు. ఆర్థర్ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వస్తుంది.