గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : సోమవారం, 24 జూన్ 2019 (19:00 IST)

సఫారీలకు ఏమైంది... (video)

ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీలు జరుగుతున్నాయి. వీటిలో లీగ్ దశ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రారంభంలో కాస్త నిస్తేజంగా సాగుతూ వచ్చిన ఈ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లు.... భారత్ - ఆప్ఘనిస్థాన్, వెస్టిండీస్ - న్యూజిలాండ్, సౌతాఫ్రికా - పాకిస్థాన్, బంగ్లాదేశ్ - ఇంగ్లండ్ మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులను ఎంతగానే ఆలరించాయి. ఈ మ్యాచ్‌లన్నీ నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిశాయి. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం పాకిస్థాన్ - సౌతాఫ్రికా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగగా, ఇది కూడా అద్భుతంగా సాగింది. అయితే, ఈ మ్యాచ్‌లో సఫారీలు ఏమాత్రం పోరాడకుండానే చేతులెత్తేశారు. ఫలితంగా 49 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా వరల్డ్ కప్ టోర్నీలో నాకౌట్ దశ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా సౌతాఫ్రికా రికార్డు సృష్టించింది. 
 
ఈ టోర్నీలో సఫారీలు ఇప్పటివరకు మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడగా, అందులో ఒక్క మ్యాచ్‌లోనే గెలుపొందారు. ఐదు మ్యాచ్‌లలో ఓటమి చెందగా, ఒక మ్యాచ్ టై అయింది. ఫలితంగా సౌతాఫ్రికా ఖాతాలో కేలం మూడు పాయింట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఈ టోర్నీ నుంచి సౌతాఫ్రికా మరికొన్ని మ్యాచ్‌లు మిగిలివుండగానే నిష్క్రమించింది.