కోహ్లీ సేనను చిత్తుగా ఓడిస్తాం : బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హాసన్

Last Updated: బుధవారం, 26 జూన్ 2019 (11:59 IST)
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ క్రికెట్ టోర్నీలో భాగంగా, వచ్చే నెల రెండో తేదీన భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేనను చిత్తుగా ఓడిస్తామని బంగ్లాదేశ్ ఆల్‍‌రౌండర్ షకీబ్ అల్ హాసన్ వెల్లడించారు. ఈ టోర్నీలో భాగంగా, ఆప్ఘన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాసన్ సెంచరీతో రాణించడంతో బంగ్లాదేశ్ గెలుపొందింది.

ఈ నేపథ్యంలో షకీబ్ హల్ హాసన్ స్పందిస్తూ, శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తే.. భారత్‌ను ఓడించే సత్తా బంగ్లాదేశ్‌కు ఉందన్నారు. టైటిల్ ఫేవరెట్ టీమ్‌ ఇండియాపై గెలవాలంటే జట్టులోని ఆటగాళ్లందరూ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుందన్నారు. టైటిల్‌పై కన్నేసిన భారత్.. అగ్రశ్రేణి జట్టు. కోహ్లీ సేనను ఓడించడం అంత తేలిక కాదన్నారు.

కానీ మా వంతు ప్రయత్నం చేస్తాం. శక్తిమేర ఆడితే భారత్‌పై నెగ్గడం సాధ్యమే. ఒంటిచెత్తో మ్యాచ్‌ను గెలిపించగలవారు టీమ్‌ ఇండియాలో చాలా మంది ఉన్నారని గుర్తుచేశారు. అయితే, తమ జట్టులోని ఆటగాళ్లంతా తమ అనుభవాన్ని, నైపుణ్యాన్ని సరిగ్గా వినియోగించుకుంటే వారిని ఓడించగలిగే జట్టు మాకూ ఉందిఅని షకీబ్ వివరించాడు.దీనిపై మరింత చదవండి :