సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 మార్చి 2023 (14:49 IST)

వన్డే ప్రపంచ కప్ 2023.. ఆతిథ్యమిస్తోన్న భారత్

World’s largest cricket stadium
ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ 2023 ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ భారతదేశంలో నిర్వహించేందుకు సిద్ధంగా వుంది. కివీస్, ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ వంటి జట్లు ఇప్పటికే ఈ ఈవెంట్‌కు అర్హత సాధించాయి. నెదర్లాండ్స్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ మిగిలి ఉన్నందున దక్షిణాఫ్రికా నేరుగా అర్హత సాధించడానికి అత్యుత్తమ స్థానాల్లో ఒకటిగా కనిపిస్తోంది. 
 
దక్షిణాఫ్రికా ఇటీవల వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ 1-1తేడాతో ముగించింది. ప్రస్తుతం సిరీస్‌ను గెలుచుకోవడంతో వారు వరల్డ్ కప్‌కి అర్హత సాధించడం ముఖ్యమైనది. 
 
తద్వారా వారు నేరుగా ఐసీసీ పురుషుల వన్డే క్రికెట్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించగలరు. బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా నెదర్లాండ్స్‌తో రేపు బెనోనిలో ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది.