1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (19:50 IST)

భారతదేశానికి ప్రయాణమైన 12 దక్షిణాఫ్రికా చిరుతలు (ఫోటోలు వైరల్)

Chitahs
Chitahs
దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుత పులులను భారత్‌కు రవాణా చేశారు. దక్షిణాఫ్రికాకు చెందిన 12 అడవి చిరుతలు మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు చేరుకోవడంలో భాగంగా శుక్రవారం చిరుతల ప్రయాణం ప్రారంభమైంది. 
 
నమీబియాకు చెందిన ఎనిమిది చిరుతల బ్యాచ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజున రిజర్వ్‌కు పరిచయం చేసిన ఐదు నెలల తర్వాత, మచ్చలతో కూడిన చిరుతలు శనివారం దేశానికి చేరుకోనున్నాయి. ఈ మేరకు చిరుత పులులు భారత్‌కు వస్తున్నట్లు ప్రకటిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ట్వీట్ చేశారు. 
 
"మన పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో దక్షిణాఫ్రికా నుండి వచ్చిన 12 చిరుతలు భారతదేశానికి తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. 
Leopard
Leopard
 
భారత వైమానిక దళానికి చెందిన సి-17 గ్లోబ్‌మాస్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ శనివారం పులులను మధ్యప్రదేశ్ చేర్చనుంది.. వారిని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి" అంటూ పేర్కొన్నారు.