శుక్రవారం, 22 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 1 నవంబరు 2023 (22:34 IST)

భారీ లక్ష్య ఛేదనలో కుప్పకూలిన కివీస్, పాకిస్తాన్‌కి దారులు తెరుచుకుంటున్నాయ్

SA vs NZ
బాదుడే బాదుడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజీలాండ్ జట్టుకు పట్టపగలే చుక్కలు చూపించారు దక్షిణాఫ్రికా బ్యాట్సమన్లు. సిక్సర్లు, ఫోర్లతో మైదానంలో మోత పుట్టించారు. ఫలితంగా దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 357 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజీలాండ్ ముందు వుంచింది. ఈ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన న్యూజీలాండ్ బ్యాట్సమన్లు ఒత్తిడికి లోనయ్యారు. జాన్సన్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ డేవన్ 2 పరుగుల వద్ద ఔటవ్వడంతో ఇక పతనం ఆరంభమైంది. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర ఒక ఫోర్ కొట్టి జాన్సన్ వేసిన బంతికే దొరికిపోయాడు.
 
అతడి స్కోరు 9 పరుగులే. ఇక ఆ తర్వాత న్యూజీలాండ్ ఆటగాళ్ల గుండెల్లో దడ మొదలైనట్లు అనిపించింది. మిచ్చెల్ 24 పరుగులు, యంగ్ 33 పరుగులు, టామ్ 4, సత్నర్ 7, సౌతీ 7, నీషామ్ 0, ట్రెంట్ 9.. ఇలా మొత్తం ఏడుగురు బ్యాట్సమన్లను కేవలం సింగిల్ డిజిట్ పరుగులకే దక్షిణాప్రికా బౌలర్లు ఔట్ చేసారంటే వారి బౌలింగ్ ఎంత పటిష్టంగా వుందో అర్థమవుతుంది. న్యూజీలాండ్ జట్టులో ఫిలిప్స్ 60 పరుగులు మినహా ఎవరూ భారీ స్కోరు చేయలేకపోయారు. ఫలితంగా 35.3 ఓవర్లకే వికెట్లన్నీ కోల్పోయి కుప్పకూలారు. 167 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీనితో దక్షిణాఫ్రికా 190 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
 
న్యూజీలాండ్ ఓటమి పాలవ్వడంతో సెమీఫైనల్లోకి దూసుకు వచ్చేందుకు పాకిస్తాన్ జట్టుకు దారులు తెరుచుకుంటున్నాయి. ఐతే ఆస్ట్రేలియా జట్టు, శ్రీలంకలు కూడా చిత్తుగా ఓడితే పాకిస్తాన్ ఆశలు మరింత రెట్టింపు అవుతాయి. రేపు భారత్-శ్రీలంక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఫలితాన్ని బట్టి పాకిస్తాన్ సెమీస్ ఆశలు పటిష్టమవుతాయో లేక బలహీనపడతాయో చూడాలి.