శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 మార్చి 2022 (18:40 IST)

ఐపీఎల్ 2022: ధనశ్రీ వర్మకు చాహల్‌ ఫ్లైయింగ్ కిస్-కావ్య నవ్వులు

Dhana Shree
ఐపీఎల్ 2022 సీజన్‌లో అందాల భామలు సందడి చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఓ బ్యూటీ తళక్కుమంది. రాజస్థాన్ బ్యాటర్లు, బౌలర్లు చెలరేగిన ప్రతిసారి ఆ అందగత్తె సందడి చేసింది. టీవీ కెమెరాలు పదే పదే ఆ బ్యూటీని చూపించాయి. 
 
ముఖ్యంగా హైదరాబాద్ ఇన్నింగ్స్ సందర్భంగా ఆ బ్యూటీ రచ్చ రచ్చ చేసింది. మొబైల్‌తో ఫొటోలను తీసింది. అయితే ఆ బ్యూటీ ఎవరో కాదు.. రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సతీమణి, ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమెకు నెటిజన్లు ఆర్‌ఆర్ బ్యూటీగా నామకరణం చేశారు.
 
ఇక ఐపీఎల్ 2022 సీజన్‌ను యుజ్వేందర్ చాహల్ అద్భుతంగా ఆరంభించాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో చాహల్ తన ఫస్ట్ ఓవర్‌లోనే వికెట్ పడగొట్టాడు. ఆ వెంటనే గ్యాలరీలో ఉన్న తన సతీమణి ధనశ్రీ వర్మకు హీరోలా ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. ఇక ఈ మూమెంట్‌కు ఫిదా అయిన ధనశ్రీ.. గంతులేస్తూ తన మొబైల్‌తో చాహల్‌ని ఫొటో తీసుకుంది. 
 
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు చేతులెత్తేశారు. దాంతో రాజస్థాన్ రాయల్స్.. పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చూసింది.
 
ఈ ఆరంభాన్ని చూసిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానుల ముఖాలు మాడిపోయాయి. ఇదెక్కడి బౌలింగ్ రా అయ్యా అంటూ తిట్టుకున్నారు. సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ సైతం చాలా నిరాశగా కనిపించింది. 
kavya
 
అయితే పవర్ ప్లే అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫార్డ్‌ను బౌలింగ్‌కు తీసుకురాగా.. అతను బ్రేక్ త్రూ అందించాడు. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(20)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. 
 
ఈ వికెట్‌తో సన్‌రైజర్స్ శిభిరంలో నవ్వులు పూసాయి. సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ సైతం చిరునవ్వులు చిందించింది. దాంతో సన్‌రైజర్స్ ఫ్యాన్స్.. మా కావ్య పాప నవ్విందోచ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.