శుక్రవారం, 3 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 మార్చి 2022 (17:43 IST)

ఆసియా కప్ ట్వంటీ-20 టోర్నీ: ఆగస్టు 27 నుంచి ఆరంభం

ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియా కప్ ట్వంటీ-20 టోర్నీ జరుగనుంది. ఐపీఎల్ ముగిసిన రెండు నెలల తర్వాత  ఈ ధనాధన్ టోర్నమెంట్ ఆరంభం కానుంది. 
 
శ్రీలంక వేదికగా ఈ టోర్నీ జరుగనుంది.  ప్రతి రెండేళ్లకు ఒకసారి టోర్నమెంట్‌ను నిర్వహిస్తోండగా... కరోనా వల్ల 2020లో టోర్నీ జరగలేదు. 2021లో జరపాలని తొలుత భావించినా అది సాధ్యపడలేదు. దీంతో 2022 ఆగస్టులో ఈ టోర్నీ నిర్వహణకు రంగం సిద్ధం చేసినట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది.
 
ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్ ఏడు సార్లు విజేతగా నిలిచి అత్యధిక సార్లు ఆసియా కప్ టైటిల్‌ను గెలిచిన జట్టుగా ఉంది. ఆ తర్వాతి స్థానంలో శ్రీలంక ఐదు టైటిల్స్‌‌తో ఉంది.
 
ప్రధాన టోర్నమెంట్ ఆగస్టు 27 నుంచి ఆరంభం కానుండగా... టోర్నీ క్వాలిఫయర్స్ మాత్రం ఆగస్టు 20 నుంచి జరుగుతాయని ఆసియా క్రికెట్ కౌన్సిల్ తన ప్రకటనలో పేర్కొంది.