శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 జూన్ 2021 (09:55 IST)

సూపర్ సిక్స్ కొట్టి తలపట్టుకున్నాడు.. కారణం ఏంటో తెలుసా? (video)

Super six
ఇంగ్లండ్‌లోని ఓ బ్యాట్స్‌మెన్ సూపర్ సిక్స్ కొట్టి తలపట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లోని ఇలింగ్‌వర్త్ సెయింట్ మేరీస్ క్రికెటర్ ఆసిఫ్ అలీ మంచి బంతికి ఓ అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. కానీ సిక్స్ కొట్టిన ఆనందం అతడిలో కనిపించలేదు. 
 
అనవసరంగా సిక్స్ కొట్టాను అంటూ తెగ ఫీలయ్యాడు. అలాగే చాలా సేపు షాక్‌లోనే ఉండిపోయాడు. కారణం ఏంటంటే..? ఎందుకంటే ఆ బ్యాట్స్‌మన్ కొట్టిన సిక్స్ గ్రౌండ్ బయట ఉన్న కారుకు తగిలింది. 
 
అయితే క్రికెట్‌లో ఇలాంటివి అన్నీ కామన్ కదా.. దానికి అంతాలా ఫీల్ అవ్వాలా అనుకుంటున్నారా..? అయితే అతడు కొట్టిన బంతి తగిలింది తన సొంత కారు వెనుక అద్దానికి.. బలంగా బంతి వచ్చి కారుపై పడడంతో వెనక అద్దం పూర్తిగా బద్ధలైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.