సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2023 (18:57 IST)

బాక్సింగ్ డే టెస్టు.. ప్రేమికులను అలా వీడియో తీసిన కెమెరా మ్యాన్

lovers
మెల్‌బోర్న్ స్టేడియంలో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టు జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 318 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 264 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్ 5 వికెట్లు, నాథన్ లియాన్ 4 వికెట్లు తీశారు.
 
దీంతో ఆస్ట్రేలియా 54 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. 3వ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
 
ఈ మ్యాచ్‌లో, ప్రేమికులు తమ ఒడిలో పడుకున్న దృశ్యాన్ని స్టేడియంలో ఉంచిన జెయింట్ స్క్రీన్‌పై చూపించారు. ఇది చూసిన ప్రేమికులు ముఖాలు కప్పుకుని పరుగులు తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఈ వీడియోపై పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వెల్ డన్ కెమెరా మ్యాన్, మీకు ఇచ్చిన పనికి మించి మీరు అదనపు పని చేశారంటూ కొందరు అభిమానులు వ్యాఖ్యానించారు.