శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2023 (11:22 IST)

రణబీర్ కపూర్‌పై కేసు.. కేక్‌పై మద్యం పోసి నిప్పు

aliba bhat - ranbir
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ప్రస్తుతం ‘యానిమల్’ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా రణబీర్ కపూర్ వీడియో వైరల్ అయింది. రణబీర్ తన కుటుంబంతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నట్లు కనిపించాడు. రణబీర్ కపూర్ క్రిస్మస్ వేడుకల వీడియో చర్చనీయాంశంగా మారింది. రణబీర్ క్రిస్మస్ జరుపుకుంటున్న ఈ వీడియోలో జై మాతా ది ఇలా చెప్పాడు. ఇప్పుడు రణబీర్‌పై ఫిర్యాదు అందింది.
 
రణబీర్ కపూర్ క్రిస్మస్ వేడుకల వీడియో వైరల్‌గా మారింది. క్లిప్‌లో, రణబీర్ 'జై మాతా ది' అని నినాదాలు చేస్తూ కేక్‌పై మద్యం పోసి నిప్పంటించాడు. అతని ఈ చర్య నెటిజన్లకు ఏమాత్రం నచ్చలేదు.
 
మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా రణబీర్‌పై ఆరోపణలు వచ్చాయి. అంతే కాకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ముంబైలోని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం రణబీర్‌పై ఫిర్యాదు నమోదైంది. అయితే, ఈ కేసులో ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు.