మంగళవారం, 14 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 జూన్ 2017 (14:36 IST)

ఛాంపియన్స్ ట్రోఫీలో యువీ రికార్డు.. 300వ వన్డే మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డ్..

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇందులో భారత్ బంగ్లాదేశ్‌తో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో యువీకి ప్రత్యేకం కానుంది. ఈ మ్యాచ్ ఆడటం ద్వారా యువరాజ్ సింగ్ 300వ వన్డే మ

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇందులో భారత్ బంగ్లాదేశ్‌తో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో యువీకి ప్రత్యేకం కానుంది. ఈ మ్యాచ్ ఆడటం ద్వారా యువరాజ్ సింగ్ 300వ వన్డే మ్యాచ్‌లో ఆడిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. అంతర్జాతీయంగా 300 లేదా అంతకంటే ఎక్కువ వన్డేలు ఆడిన ఐదో భారత ఆటగాడిగా యువీ అవతరించబోతున్నాడు. 
 
యువరాజ్ తర్వాత ధోనీ ఈ ఘనతకు దగ్గర్లో ఉన్నాడు. గురువారం జరగబోతున్న సెమీఫైనల్ మ్యాచ్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి 290వది. ఇక అందరికంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 463 వన్డే మ్యాచ్‌లతో అగ్రస్థానంలో నిలిచాడు. 
 
అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 463 వన్డే మ్యాచ్‌లతో అగ్రస్థానంలో నిలవగా, మహేళ జయవర్ధనే - 448, జయసూర్య - 445 టాప్-3లో నిలిచారు. యువరాజ్ సింగ్ 299 మ్యాచ్‌లో 20వ స్థానంలో ఉన్నప్పటికీ.. 300వ మ్యాచ్ ఆడాక యువీ 19వ స్థానాన్ని కైవసం చేసుకుంటాడు.