విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువ ఎంతో తెలుసా?

virat kohli
Last Updated: శుక్రవారం, 11 జనవరి 2019 (08:41 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువ అమాంతం పెరిగిపోయింది. గత యేడాది మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీ బ్రాండ్‌గా ఎంపికైన ఆయన వరుసగా రెండోసారి కూడా ఎంపికయ్యారు. వివిధ వాణిజ్య సంస్థలకు చేస్తున్న ప్రచారాన్ని లెక్కలోకి తీసుకుంటూ ప్రముఖ గ్లోబల్ వాల్యుయేషన్, కార్పొరేట్ ఫైనాన్స్ సలహాదారు సంస్థ డఫ్ అండ్ ఫెల్ఫస్ తాజా నివేదిక ఇచ్చింది.

ఈ నివేదిక ప్రకారం 18 శాతం పెరుగుదలతో 2018లో కోహ్లి బ్రాండ్‌ విలువ ఏకంగా దాదాపు రూ.1,200 కోట్లు (170.9 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు)కు చేరుకున్నట్టు తెలిపింది. దీంతో ఈ జాబితాలో భారత కెప్టెన్‌ అగ్రస్థానం మరింత పదిలమైంది. కోహ్లీ గతేడాది నవంబరు వరకు 24 ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉన్నాడు. ఇదే సమయానికి 21 ఉత్పత్తులను ఎండార్స్‌ చేస్తున్న బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పడుకోనె రూ.718 కోట్ల (102.5 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) బ్రాండ్‌ విలువతో రెండో స్థానం దక్కించుకుంది.దీనిపై మరింత చదవండి :