కుంబ్లే భాయ్ రాజీనామాను గౌరవిస్తున్నాం.. అది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం: కోహ్లీ
వెస్టిండీస్‌తో శనివారం నుంచి టీమిండియా వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అనిల్ కుంబ్లే వివాదంపై నోరు విప్పాడు. టీమిండియా మాజీ చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట
వెస్టిండీస్‌తో శనివారం నుంచి టీమిండియా వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అనిల్ కుంబ్లే వివాదంపై నోరు విప్పాడు. టీమిండియా మాజీ చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెలరేగిన వివాదంపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని అనిల్ భాయ్ నిర్ణయించారు. ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని చెప్పారు.
అయితే కుంబ్లే రాజీనామాకు కారణం మాత్రం చెప్పలేదు. కుంబ్లే రాజీనామాపై ఎన్నో ఊహాగానాలు ప్రచారమవుతున్నాయని చెప్పాడు. తాను డ్రెస్సింగ్ రూమ్‌లో అనుచితంగా వ్యాఖ్యలు చేయబోనన్నాడు. అసలు డ్రెసింగ్ రూమ్‌కు ఏమాత్రం సంబంధం లేనివాళ్లు ప్రచారం చేసే ఊహాగానాలపై స్పందించబోనని తెలిపాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగిందన్న విషయం పూర్తిగా ప్రైవేట్ వ్యవహారమన్నాడు.