మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 16 జనవరి 2019 (15:56 IST)

సచిన్ - పాంటింగ్‌లను అధికమిస్తాడు : అజారుద్దీన్

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండే వన్డే మ్యాచ్‌లో సెంచరీతో రాణించిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ తన ఫిట్నెస్‌ను కాపాడుకుంటే ఖచ్చితంగా వంద సెంచరీలు చేయడమేకాకుండా, మాజీ క్రికెటర్లు సచిన్, రికీ పాంటింగ్‌లను అధికమిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. 
 
అడిలైడ్‌లో చేసిన సెంచరీ కోహ్లీ వన్డే కెరీర్‌లో 39వ సెంచరీ. టెస్టులు, వన్డేలు కలుపుకుని ఇప్పటివరకు మొత్తం 64 సెంచరీలు చేశాడు. దీంతో ఇప్పటివరకు అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు సచిన్, పాంటింగ్ తర్వాతి స్థానాల్లో కోహ్లీ నిలిచాడు. 
 
దీనిపై అజారుద్దీన్ స్పందిస్తూ, 'విరాట్‌ కోహ్లీ నిలకడగా బాగా ఆడుతున్నాడు. ఫిట్‌గా ఉంటే 100 సెంచరీల మార్క్‌ను ఖచ్చితంగా చేరుకుంటాడు. కోహ్లీ గొప్ప ఆటగాడు. అతడు సెంచరీ చేసినప్పుడు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే భారత జట్టు ఓడిపోయింది' అని అజారుద్దీన్ గుర్తుచేశారు.