పరమ చెత్త ఆటగాడు ఎవరన్నా వున్నారంటే అది కోహ్లీనే...

kohli
Last Modified మంగళవారం, 18 డిశెంబరు 2018 (14:46 IST)
ఇండియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ పెద్ద చెత్త ఆటగాడిలా తయారయ్యాడంటూ బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా సంచలన కామెంట్లు చేశారు. కోహ్లీ ప్రవర్తన కూడా అత్యంత చెత్తగా వుంటోందని మండిపడ్డారు. ఆతడి ప్రవర్తనతో తను ఆడే ఆట కూడా మసకబారుతోందనీ, రికార్డులన్నీ ఎందుకూ పనికిరాకుండా పోతాయేమోనన్న డౌట్ వస్తోందని వ్యాఖ్యానించాడు.

తను చేసిన ఈ వ్యాఖ్యలు కనుక కోహ్లి చూస్తే తనను కూడా వేరే దేశం వెళ్లిపొమ్మని చెప్పే అవకాశం లేకపోలేదని కూడా వ్యాఖ్యానించాడు. ఐతే అతడు ఎంత చెప్పినా నేను మాత్రం భారతదేశాన్ని వదలిపెట్టబోనని అన్నారు. ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన కోహ్లి ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నాడో తనకు అర్థం కావడంలేదన్నాడు.

ఇటీవలే కోహ్లి ఓ నెటిజన్ పైన మండిపడటాన్ని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు నసీరుద్దీన్ షా. కోహ్లి కంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్ల ఆటతీరు భేషుగ్గా వుంటుందని కామెంట్ పెట్టగానే... ఐతే నువ్వు ఇండియాను వదిలేసి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాలకు వెళ్లిపో అంటూ కోహ్లి రివర్స్ ఎటాక్ చేశారు. దీనిని నసీరుద్దీన్ ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించారు. మరి కోహ్లి తన ప్రవర్తనను మార్చుకుంటారో లేదో?దీనిపై మరింత చదవండి :