మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 11 డిశెంబరు 2016 (17:40 IST)

ఇంగ్లండ్‌పై గెలుపు తేలికే.. కోహ్లీ డబుల్ సెంచరీ.. విరాట్ పేరుతో కొత్త రూ.200 నోటు

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ విజయం ఖాయమయ్యేలా ఉంది. మ్యాచ్‌తో పటు, సిరీస్‌ను గెలుచుకోవడం కోహ్లీ సేనకు తేలికే కానుంది. భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జ

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ విజయం ఖాయమయ్యేలా ఉంది. మ్యాచ్‌తో పటు, సిరీస్‌ను గెలుచుకోవడం కోహ్లీ సేనకు తేలికే కానుంది. భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు ఇంకా 49 పరుగులు మాత్రమే వెనకబడి ఉంది. 
 
సుమారు 90 ఓవర్ల పాటు జరగాల్సిన ఆఖరి రోజు ఆట మిగిలి ఉండటంతో మ్యాచ్ కోల్పోకుండా ఉండాలంటే కుక్ సేన సాధ్యమైనన్ని ఓవర్ల పాటు వికెట్ కోల్పోకుండా అసలు సిసలైన టెస్ట్ బ్యాటింగ్ చెయ్యాల్సి ఉంటుంది. కానీ ఈ లోపు ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఆపై సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఆడాల్సి వస్తే ఆ కొద్దిపాటి పరుగులను కూడా ఛేదించి కోహ్లీసేన సీరీస్‌ను కైవసం చేసుకుంటుందని క్రికెట్ పండితులు జోస్యం చెప్తున్నారు. 
 
ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్‌తో టీమిండియా ముంబైలో ఆడుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌ నాలుగో రోజున విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ ఏడాదిలో మూడుసార్లు డబుల్ సెంచరీ చేసి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కోహ్లీని ఆయన అభినందనలతో ముంచెత్తారు. 
 
అంతేకాదు...కోహ్లీ ట్రిపుల్ డబుల్ సెంచరీ నేపథ్యంలో ప్రభుత్వానికి ఓ సూచన చేశారు. కొత్త రూ.200 నోట్లు ముద్రించాల్సిందిగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆయన ఓ ప్రతిపాదన చేశారు. ప్రతిపాదిత కరెన్సీ నోట్‌ ఫోటోను కూడా ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.