శనివారం, 25 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 అక్టోబరు 2018 (13:54 IST)

కలహించుకున్న అనుష్క - ఆయేషా?

భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్‌ల భార్యలు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. దీనికి కారణం లేకపోలేదు.

భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్‌ల భార్యలు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. దీనికి కారణం లేకపోలేదు.
 
సాధారణంగా భారత క్రికెట్ జట్టు విదేశీ టూర్లకు వెళ్లిన సమయంలో తమతమ భార్యలు లేదా ప్రియురాళ్ళను వెంటబెట్టుకుని తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో గత ఇంగ్లండ్ పర్యటన సమయంలో కోహ్లీ భార్య అనుష్క శర్మ జట్టుతో ఉండటంపై అనేక విమర్శలు చెలరేగాయి. 
 
అయితే, తాజాగా ధవన్‌ భార్య ఆయేషా, అనుష్క మధ్య గొడవ జరిగిందనే విషయం సంచలనం రేపుతోంది. ధవన్‌ను టీమ్‌ నుంచి తప్పించడంతో అనుష్క, ఆయేషా ఎడమొహం పెడమొహంగా ఉన్నారని ఓ పత్రిక కథనం రాసింది. 
 
టీమ్‌ సమావేశాల సమయంలో కూడా అనుష్క అక్కడే ఉండేదని కూడా పేర్కొంది. మ్యాచ్‌ల సమయంలో ఆటగాళ్ల భార్యలు, గాళ్‌ఫ్రెండ్స్‌ మంచి స్నేహితుల్లా కలసిపోవడం కనిపిస్తుంది. స్టాండ్స్‌ నుంచే ఆడేవాళ్లను ఉత్సాహపరుస్తారు. అలాంటి వారు కలహించుకున్నారంటే నమ్మశక్యం కావడం లేదని బోర్డు అధికారి ఒకరు అన్నారు. 
 
పైగా, అనుష్క, ఆయేషా ఎంతోకాలంగా స్నేహితులని తెలిపారు. లండన్‌లో జరిగిన రెండో వన్డేకు కోహ్లీనే వారికి పాస్‌లు ఇప్పించాడని చెప్పారు. అయితే, తమ మధ్య ఏమీ జరగలేదని ఆయేషా చెప్పినట్టుగా తెలిసింది. కానీ, ప్రస్తుతం వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదని సమాచారం.