మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 నవంబరు 2019 (14:24 IST)

సనత్ జయసూర్యను అనుకరించిన అశ్విన్.. వీడియో వైరల్

డే అండ్ నైట్ టెస్టు కోసం ఇప్పటికే ఈడెన్ గార్డెన్స్‌కు చేరుకున్న టీమిండియా ఫ్లడ్ లైట్ల వెలుగులోకి నెట్ ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలో అశ్విన్ పింక్ బాల్‌తో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. అశ్విన్ జట్టు ప్రాక్టీస్ సెషన్లో ఎడమ చేతితో బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్యను అనుకరించే ప్రయత్నం చేశాడు. 
 
సనత్ జయసూర్య ఏ విధంగానైతే ఎడమచేత్తో బౌలింగ్ చేస్తాడో అదే విధంగా రవిచంద్రన్ అశ్విన్ సైతం ప్రాక్టీస్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రాక్టీస్ అనంతరం అశ్విన్ మాట్లాడుతూ "పింక్ బాల్‌తో ఆడటం ఓ సవాల్. నేను పింక్ బంతితో ఒక్క బంతిని కూడా బౌల్ చేయలేదు" అని పేర్కొన్నాడు.
 
కాగా ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే.