శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (22:44 IST)

విరాట్ కోహ్లీ వీడియో వైరల్.. వాటర్ బాయ్‌గా మారాడు.. రన్ తీశాడు..

Kohli
Kohli
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆటలో వున్నా లేకున్నా.. అభిమానులను ఎంటర్‌టైన్ చేయడంలో వెనుకాడడు. తాజాగా ఆసియా కప్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కోహ్లీ వున్నా లేకపోయినా మస్తుగా క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. 
 
విరాట్ కోహ్లి అవకాశం దొరికినప్పుడల్లా తన కామెడీ వైపు అభిమానులను తిప్పుకుంటున్నాడు. తాజాగా శుక్రవారం భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఆసియా కప్ సిరీస్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. 
 
ఆసియా కప్ 2023 సిరీస్‌లో భారత జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించడంతో శుక్రవారం మ్యాచ్‌లో విరాట్ కోహ్లీకి విశ్రాంతి లభించింది. ఆ విధంగా, మ్యాచ్ మొదటి అర్ధభాగంలో, అతను మైదానంలో భారత ఆటగాళ్లకు నీరందించడానికి "వాటర్ బాయ్"గా పనిచేశాడు. 
 
అప్పుడు విరాట్ కోహ్లీ వేగంగా పరుగు తీశాడు. ఒక్కసారిగా ఏమనుకున్నాడో తెలియదు గానీ, విరాట్ కోహ్లి పరుగెత్తిన తీరు అందరికి నవ్వు తెప్పించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.