సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (16:05 IST)

మూడో ట్వంటీ20లో ఎందుకు ఓడిపోయారో వివరించిన కోహ్లీ!

ఆస్ట్రేలియా గడ్డపై పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు మంగళవారం జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన కోహ్లీ ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆటగాళ్లు రెచ్చిపోయి, నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత 187 పరుగుల లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన కోహ్లీ సేన 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో ఆసీస్ గడ్డపై టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేయకుండా ఆస్ట్రేలియా 2-1 తేడాతో అడ్డుకుంది. 
 
ఈ ఓటమికి గల కారణాలను మ్యాచ్ అనతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరించారు. మిడిల్ ఓవర్లతో తమ బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో లేదన్నాడు. ఇదే తాము ఓడిపోవడానికి ఇదే కారణమన్నాడు. 
 
హార్ధిక్ పాండ్యా ఆడుతున్నప్పుడు ఒకనొక సమయంలో తాము గెలుస్తామని అనుకున్నామని చెప్పాడు. మిడిల్ ఓవర్లలో ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయామని తెలిపాడు.