శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 9 జూన్ 2019 (16:53 IST)

వరల్డ్ కప్ : భారత ఓపెనర్ల వీరవిహారం.. అర్థసెంచరీలతో కుమ్ముడు

ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్ల బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ, శిఖర ధవాన్‌లు ఆరభంలో ఆచితూచి ఆడారు. ఆ తర్వాత బ్యాట్‌కు పని చెప్పడంతో స్కోరు బోర్డు పరుగులు పెడుతోంది. ముఖ్యంగా ఇద్దరు ఓపెనర్లు అర్థసెంచరీలు కొట్టారు. 
 
ప్రస్తుతం భారత్ స్కోరు 21.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 124 పరుగులు చేసింది. ఇందులో రోహిత్ శర్మ మూడు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 55 పరుగులు చేయగా, శిఖర్ ధవాన్ 9 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లు భారత ఓపెనర్లను ఏమాత్రం కట్టడి చేయలేక చేతులెత్తేశారు. ఫలితంగా భారత ఓపెనర్లు వీర కుమ్ముడు కుమ్ముతున్నారు. ఇదే విధంగా మరో పది ఓవర్ల వరకు ఓపెనర్లిద్దరూ క్రీజ్‌లో ఉంటే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయంగా తెలుస్తోంది. 
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన తుది జట్ల వివరాలను పరిశీలిస్తే, 
భారత్ : శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కోహ్లీ, కేఎల్ రాహుల్, ధోనీ, హార్దిక్ పాండ్యా, కేఎం జాదవ్, భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్, చాహల్, జస్ప్రీత్ బూమ్రా. 
ఆస్ట్రేలియా జట్టు : వార్నర్, ఫించ్, ఖవాజా, స్మిత్, మ్యాక్స్‌వెల్, స్టోయిన్స్, కేరీ, కౌల్టర్ నైల్, కుమ్మిన్స్, స్ట్రాక్, జంపా.