సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By మోహన్ మొగరాల
Last Modified: మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (20:55 IST)

మీరు ఇలాంటి అవుట్ ఎప్పుడైనా చూసారా?

క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అవడం, రనౌట్ అవ్వడం, హిట్ వికెట్ అవ్వడం, అలాగే బౌలర్ బంతిని తాకడం వల్ల నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో బ్యాట్స్‌మెన్ అవుటవ్వడం చూసారు. మరి బ్యాట్స్‌మెన్ బలంగా కొట్టిన బంతి ఫీల్డర్ హెల్మెట్‌కు తగిలి, అది కాస్తా పైకి లేచి బౌలర్ చేతిలో పడింది. 
 
ఈ తరహాలో బ్యాట్స్‌మెన్ ఔటైన ఘటన ఆస్ట్రేలియా క్రికెట్‌లో చోటు చేసుకుంది. బ్యాట్స్‌మెన్‌ను దురదృష్టం వెంటాడింది. షెఫల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా న్యూసౌత్‌వేల్స్‌-వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ సంఘటన జరిగింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున బ్యాటింగ్ చేస్తున్న హిల్టన్‌ కార్ట్‌రైట్‌ రెండో ఇన్నింగ్స్‌లో న్యూసౌత్‌వేల్స్‌ లెగ్ స్పిన్నర్ జాసన్ సంగా వేసిన బంతిని హిట్ చేసేందుకు బలంగా ప్రయత్నించాడు. 
 
కార్ట్‌రైట్ కాస్త దూకుడుగా ఆడే క్రమంలో భారీ షాట్ కొట్టాడు. అది కాస్తా షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న నిక్ లార్కిన్ హెల్మెట్ తగిలి అంతే వేగంగా గాల్లోకి లేచింది. ఆ బంతిని బౌలర్‌ సంగా క్యాచ్‌ పట్టుకోవడంతో కార్ట్‌రైట్ వెనుదిరిగాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ అద్భుత క్యాచ్‌ని మీరు కూడా ఓసారి చూసేయండి.