శనివారం, 22 మార్చి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 మార్చి 2025 (15:48 IST)

ధోనీకి అలా ఘనమైన వీడ్కోలు పలకాలి : ఆకాష్ చోప్రా

MS Dhoni
చెన్నై సూపర్‌ కింగ్స్‌ గత సీజన్‌ నుంచి రుతురాజ్‌ గైక్వాడ్‌‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తోంది. ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో అతణ్ని రూ.18 కోట్లకు రిటైన్‌ చేసుకుంది. అలాగే రవీంద్ర జడేజా రూ.18 కోట్లు, పతిరన రూ.13 కోట్లు, శివమ్ దూబే రూ.12 కోట్లు, ధోనీ రూ.4 కోట్లు)ని అలాగే అట్టి పెట్టుకుంది. 
 
ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్‌లో సీఎస్కేకు ఆరో టైటిల్‌ అందించే అద్భుత అవకాశం రుతురాజ్‌ గైక్వాడ్‌కు ఉందని భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఒక వేళ ఇదే ధోనీకి ఆఖరి ఐపీఎల్‌ సీజన్‌ అనుకుంటే... ఆయనకు ట్రోఫీతో ఘనంగా వీడ్కోలు పలికినట్లూ అవుతుందన్నాడు. 
 
ఇదే అంశంపై చోప్రా మాట్లాడుతూ, 'రుతురాజ్‌ గైక్వాడ్‌కు అద్భుతమైన టీమ్‌కు సారథ్యం వహించే అవకాశం దక్కింది. ఐపీఎల్‌ టైటిళ్లు సాధించడంలో ధోనీ వారసత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత అతనికి ఉంది. ఈ విషయంలో ఒత్తిడి ఉండే విషయం వాస్తవమే. గత సీజన్‌లో సీఎస్కే విఫలమైంది. అయితే చెన్నై సూపర్‌కింగ్స్‌ లాంటి జట్టు ఇలా ప్రతిసారీ టైటిల్‌ గెలుచుకోకుండా సీజన్ ముగిస్తే ఎలా? ధోనీ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఐపీఎల్‌లో ఆడతాడో తెలియదు. ఒక వేళ ఇదే ఆఖరి సంవత్సరమూ కావచ్చు. అదే వాస్తవమైతే మీరంతా అతడికి ట్రోఫీతో ఘనమైన వీడ్కోలు పలకాల్సి ఉంటుంది. ఇది రుతురాజ్‌ గైక్వాడ్‌కు అద్భుత అవకాశం' అభిప్రాయపడ్డారు.