1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (15:17 IST)

డిసెంబరులో పెళ్లి చేసుకుంటాం : యువరాజ్ సింగ్

తన ప్రియురాలిని వచ్చే డిసెంబరు నెలలో వివాహం చేసుకోనున్నట్టు భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ వెల్లడించాడు. ఇంగ్లీషు అమ్మాయి హేజిల్ కీచ్‌తో యువరాజ్ సింగ్ ప్రేమలో పడిన విషయం తెల్సిందే.

తన ప్రియురాలిని వచ్చే డిసెంబరు నెలలో వివాహం చేసుకోనున్నట్టు భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ వెల్లడించాడు. ఇంగ్లీషు అమ్మాయి హేజిల్ కీచ్‌తో యువరాజ్ సింగ్ ప్రేమలో పడిన విషయం తెల్సిందే. 
 
అయితే, వీరిద్దరు ఎపుడు ఓ ఇంటివారు కాబోతున్నారన్న అంశంపై అనేక రకాలైన గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై యూవీ మాట్లాడుతూ.. డిసెంబర్‌ మొదటివారంలో తాను హేజిల్‌ని వివాహం చేసుకుంటున్నానని ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పాడు. 
 
అనంతరం కాబోయే భార్య హేజిల్‌తో కలిసి ర్యాంప్‌ వాక్‌ చేశాడు. యువరాజ్‌తో పాటు క్రికెటర్లు క్రిస్‌గేల్‌, రోహిత్‌ శర్మలూ ర్యాంప్‌ వాక్‌ చేశారు. ఈ ఫ్యాషన్‌ కార్యక్రమానికి బాలీవుడ్‌ ప్రముఖులు కూడా హాజరయ్యారు.