నాలుగు పదుల వయసులోనూ యువరాజ్ స్టన్నింగ్ క్యాచ్ (Video)
భారత క్రికెట్ జట్టు చరిత్రలో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు ప్రత్యేకంగా ఓ పేజీ ఉంటుంది. ఒంటి చేత్తో భారత జట్టుకు అనేక విజయాలను అందించాడు. ఈ క్రమంలో ఫామ్‌ను కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత క్యాన్సర్ బారినపడి తిరిగికోలుకున్నాడు. అయితే, తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో 43 యేళ్ళ యువరాజ్ సింగ్ స్టన్నింగ్ క్యాచ్ పట్టి ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకను నాలుగు పరుగుల తేడాతో ఇండియా జట్టు మట్టికరిపించింది.
ఇంటర్నేషనల్ మాస్టర్ లీగ్‌లో టోర్నీలో భారంగా శ్రీలంక మాస్టర్స్, ఇండియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇర్ఫాన్ బౌలింగ్‌లో లంక జట్టు ఆటగాడు లహిరు తిరిమన్నే కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి ఒడిసిపట్టుకున్నాడు. 43 యేళ్ల వయసులోనూ అప్పటి యువరాజ్ సింగ్‌ను గుర్తుచేశాడు. దీంతో యూవీ క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అటు బ్యాటింగ్‌లోనూ యూవీ అదరగొట్టాడు మొత్తం 22 బంతులు ఎదుర్కొని 2 సిక్సర్లు, 2 బౌండరీల సాయంతో అజేయంగా 31 పరుగులు చేశాడు. అతనితో పాటు గుకీరత్ సింగ్ (44), స్టూవర్ట్ బిన్నీ (68), యూసుఫ్ పఠాన్ (56 నాటౌట్)లు రాణించడంతో ఇండియా మాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.
ఆ తర్వాత 223 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మాస్టర్స్ 218 రన్స్ మాత్రమే చేసింది. దీంతో నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ జట్టులో కుమార్ సంగక్కర 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇర్ఫాన్ పఠాన్ మూడు వికెట్లు తీసి ఇండియా మాస్టర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.