శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 17 జూన్ 2017 (05:29 IST)

కేన్సర్‌నే జయించాడు.. యువరాజ్ లేని భారత వన్డే జట్టును ఊహించలేం: రాహుల్ ఉద్వేగం

యువరాజ్ సింగ్ లేని భారత వన్డే జట్టును తానయితే ఊహించలేనని భారత క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. క్యాన్సర్ ను సైతం జయించడమే అతి పెద్ద విషయమైతే, ఆ తరువాత కూడా యువరాజ్ మునుపటిలా ఆడటం నిజంగా అద్భుతం 'అని ద్రవిడ్ కొనియాడాడు. మూడొందల వన్డే మ్యా

యువరాజ్ సింగ్ లేని భారత వన్డే జట్టును తానయితే ఊహించలేనని భారత క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. క్యాన్సర్ ను సైతం జయించడమే అతి పెద్ద విషయమైతే, ఆ తరువాత కూడా యువరాజ్ మునుపటిలా ఆడటం నిజంగా అద్భుతం 'అని ద్రవిడ్ కొనియాడాడు. మూడొందల వన్డే మ్యాచ్ ఆడి అరుదైన ఘనతను సొంత చేసుకున్న భారత స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ పై దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతని పదిహేడేళ్ల క్రికెట్ కెరీర్ అసాధారణమని ద్రవిడ్ కితాబిచ్చాడు. అసలు యువరాజ్ లేని ఆల్ టైమ్ వన్డే ఎలెవన్ జట్టును చూడటం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. సీరియస్ గా చూస్తే యువరాజ్ లేని భారత వన్డే జట్టును ఊహించలేమన్నాడు. ' 
 
యువరాజ్ జట్టులో ఉండాలని ప్రతీ భారత అభిమాని కోరుకుంటాడు. అతని సుదీర్ఘ కెరీర్లో సాధించిన అద్భుతమైన ఘనతలే యువరాజ్ ను ఉన్నతస్థానంలో నిలబెట్టాయి. యువరాజ్ లేని జట్టును ప్రస్తుతం ఎవరూ కోరుకోరు. ఒంటి చేత్తో ఎన్నో విజయాల్ని అందించాడు. అతనొక క్రికెట్ సూపర్ స్టార్. యువరాజ్ లేకుండా జట్టును ఊహించలేము. క్యాన్సర్ ను సైతం జయించడమే అతి పెద్ద విషయమైతే, ఆ తరువాత కూడా యువరాజ్ మునుపటిలా ఆడటం నిజంగా అద్భుతం 'అని ద్రవిడ్ ప్రశంసించాడు.
 
చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ యువరాజ్ కు 300వ వన్డే. అయితే ఆ మ్యాచ్ లో యువరాజ్ బ్యాటింగ్ కు దిగకుండానే భారత్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది.ఇదిలా ఉంచితే, చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు ఫామ్‌ను కొనసాగించి టైటిల్ ను సాధించాలని ద్రవిడ్ ఆకాంక్షించాడు. మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి అదే ఆట తీరును తుది పోరులో కనబరుస్తాడని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాడు. అయితే భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాలని కోహ్లికి ద్రవిడ్ సూచించాడు. 
 
ఇటీవల అతి పెద్ద లక్ష్యాలను సైతం భారత్ సునాయాసంగా ఛేదించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ద్రవిడ్.. జట్టు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు పలువురు సీనియర్ ఆటగాళ్లు తమ అనుభవంతో ఆదుకుంటున్నారన్నాడు. ఇది భారత జట్టు పటిష్టతను తెలియజేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.