శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శుక్రవారం, 21 జులై 2017 (03:47 IST)

వీరనారీ విహారం... ప్రపంచ కప్ పైనల్లో భారత మహిళా జట్టు.. దిమ్మ తిరిగిన ఆసిస్

భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్రలో ఒక అద్భుత ఘట్టం, ఒక నూతన శకం ఆరంభానికి నాందిపలికిన ఘటనకు ఈ గురువారం సాక్షీభూతంగా నిలిచింది. ఒక కపిల్ దేవ్, ఒక వీరేంద్ర సెహ్వాగ్, ఒక గిల్ క్రిస్ట్, ఒక డివీలియర్స్, ఒక

భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్రలో ఒక అద్భుత ఘట్టం, ఒక నూతన శకం ఆరంభానికి నాందిపలికిన ఘటనకు ఈ గురువారం సాక్షీభూతంగా నిలిచింది. ఒక కపిల్ దేవ్, ఒక వీరేంద్ర సెహ్వాగ్, ఒక గిల్ క్రిస్ట్, ఒక డివీలియర్స్, ఒక క్రిస్ గేల్.. వీరిందరినీ మించి వివియన్ రిచ్చర్డ్స్ . ఒక  మహిళ తన వీరనారీ విహారంతో ఆధునిక క్రికెట్‌లో  బ్యాటింగ్ దిగ్గజాలందరినీ గుర్తు చేసింది. ఆడుతోంది ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌... అయితేనేం ప్రత్యర్థి బౌలర్లపై సునామీలా చెలరేగిన ఆమె అద్భుతాన్ని ఆవిష్కరించింది. బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ చెలరేగిపోయి పరుగుల వరద పారించిన ఈ పంజాబ్‌ సివంగి భారత్‌కు అపురూప విజయాన్ని అందించింది. ఒక్క మాటలో చెప్పాలంటే 1983లో టన్‌బ్రిడ్జ్‌వెల్స్‌లో జింబాబ్వేపై  కపిల్‌దేవ్‌ ఇన్నింగ్స్‌తో పోల్చదగిన ప్రదర్శనతో హర్మన్ ప్రీత్ కౌర్‌ ఆసీస్‌ ఆట కట్టించింది. 
 
ఒక్క మాటలో చెప్పాలంటే 1983లో టన్‌బ్రిడ్జ్‌వెల్స్‌లో జింబాబ్వేపై  కపిల్‌దేవ్‌ ఇన్నింగ్స్‌తో పోల్చదగిన ప్రదర్శనతో కౌర్‌ ఆసీస్‌ ఆట కట్టించింది. ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లో మరే భారత క్రికెటర్‌ కూడా సాధించని ఘనతను తన పేరిట లిఖించుకున్న హర్మన్, ఆల్‌టైమ్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. ఆరుసార్లు చాంపియన్‌ ఆసీస్‌ను ఇంటిదారి పట్టించి ఈ మెగా ఈవెంట్‌లో రెండోసారి ఫైనల్‌ చేరింది. అడుతోంది ప్రత్యేర్ఖి, గత ప్రపంచ కప్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో. తోటి జట్లను అదరగొట్టడమే పనిగా పెట్టుకుని ప్రపంచకప్‌లో వరుస విజయాలు సాధిస్తున్న ఆసీస్‌ను మహిళా క్రికట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అదరగొట్టింది టీమిండియా మహిళా జట్టు. బ్యాటింగ్‌లో 42 ఓవర్లలో మన మహిళలు 281 పరుగులు చేస్తారని ఎవరైనా కలగన్నారా.. అదే ఊపులో బౌలింగ్‌లో దుమ్మురేపిన టీమిండియా బౌలర్లు ఆసీస్ జట్టును కల్లో ఊహించని రీతిలో వరుస ఔట్లకు గురిచేస్తూ ప్రపంచస్థాయి జట్టును ఇంటి దారి పట్టించారు. 
 
అంచనాలకు అందని రీతిలో అద్భుతంగా ఆడిన మిథాలీ సేన సగర్వంగా ఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం ఇక్కడ జరిగిన రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ 36 పరుగుల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 4 వికెట్లకు 281 పరుగుల భారీ స్కోరు సాధించింది. మెరుపు ఇన్నింగ్స్‌తో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (115 బంతుల్లో 171 నాటౌట్‌; 20 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆసీస్‌ భరతం పట్టింది. అనంతరం తీవ్ర ఒత్తిడి మధ్య ఆడిన ఆస్ట్రేలియా 40.1 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. అలెక్స్‌ బ్లాక్‌వెల్‌ (56 బంతుల్లో 90; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), విలాని (58 బంతుల్లో 75; 13 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. హర్మన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచింది.  ఆదివారం లార్డ్స్‌లో జరిగే ఫైనల్లో భారత్‌ ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌తో తలపడుతుంది.
 
గత మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీతో రాణించిన హర్మన్‌ప్రీత్‌ ఈసారి అసలైన తరుణంలో తన మెరుపు బ్యాటింగ్‌ను ప్రదర్శించింది. షుట్‌ వేసిన 23వ ఓవర్లో మోకాళ్లపై కూర్చొని కౌర్‌ ఆడిన షాట్‌ ఇన్నింగ్స్‌ హైలైట్‌లలో ఒకటి. ఇదే ఓవర్లో కౌర్‌ను స్టంపౌంట్‌ చేసే సునాయాస అవకాశాన్ని హీలీ చేజార్చింది. ఆ సమయంలో కౌర్‌ స్కోరు 35. ఆ తర్వాత ఇక ఆమెను ఆపడం ఆసీస్‌ తరం కాలేదు. గార్డ్‌నర్‌ వేసిన 37వ ఓవర్లో కౌర్‌ పండగ చేసుకుంది. తొలి బంతికి శర్మ సింగిల్‌ తీయగా, తర్వాతి ఐదు బంతుల్లో కౌర్‌ 6, 6, 4, 4, 2 బాదడంతో ఆ ఓవర్లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. చివరి 10 ఓవర్లలో భారత్‌ ఏకంగా 129 పరుగులు సాధించడం విశేషం.