ఒక్క గేమ్ పోయింది.. కోహ్లీపై అందరూ ఫైర్.. పాక్‌ను చూసి నేర్చుకోమంటున్నారే..
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు.. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన శ్రీలంక చేతిలో ఓటమి పాలుకావడంతో విమర్శల వర్షం కురుస్తోంది. శ్రీలంకను తక్కువ అంచనా వేయడంతో భారత క్రికెట్ జట్టు తగిన మూల్యం చెల్లించుకుందని మా
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు.. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన శ్రీలంక చేతిలో ఓటమి పాలుకావడంతో విమర్శల వర్షం కురుస్తోంది. శ్రీలంకను తక్కువ అంచనా వేయడంతో భారత క్రికెట్ జట్టు తగిన మూల్యం చెల్లించుకుందని మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లి ధ్వజమెత్తాడు. అసలు గేమ్ ప్లాన్ ఎలా ఉండాలో పాకిస్తాన్ క్రికెట్ జట్టును చూసి నేర్చుకుంటే బాగుంటుందంటూ తీవ్రంగా మండిపడ్డాడు. వరల్డ్ నంబర్ వన్ జట్టైన దక్షిణాఫ్రికాను పాకిస్తాన్ ఎలా కట్టడి చేసి విజయం సాధించిందో ఒకసారి కోహ్లి చూసి నేర్చుకుంటే బాగుంటుందంటూ చురకలంటించాడు.
'మిస్టర్ కోహ్లి.. ఎక్కడ నీ గేమ్ ప్లానింగ్. పరుగుల సునామీలో లంకేయులు పైచేయి సాధించారు. ఇక్కడ టీమిండియా ప్లానింగ్ కనబడలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ గేమ్ ప్లాన్ ను ఒక్కసారి చూడండి. సఫారీలపై పాక్ ప్రణాళిక చాలా బాగుంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో పాక్ ప్రణాళికను చూసి కోహ్లి కచ్చితంగా నేర్చుకుంటే మంచిది'అని కాంబ్లి విమర్శించాడు.