గురువారం, 28 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 19 జూన్ 2017 (07:29 IST)

ఫైనల్లో ఓడిపోయాక సాకులు చెప్పడం అనవసరం కానీ.. ఒకే తప్పు పదే పదే జరిగితే ఎలా?

టీమిండియా చేతుల్లోని చాంపియన్స్‌ ట్రోఫీని చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఎగురేసుకు పోయిందానికి ఎవరు కారకులు అని సాకులు వెతకడం అనవసరం. ఓటమి ఓటమే. భారత్‌పై పాక్ విజయాన్ని దాని అనుకోని భాగ్యంలాగా భావిస్తే

టీమిండియా చేతుల్లోని చాంపియన్స్‌ ట్రోఫీని చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఎగురేసుకు పోయిందానికి ఎవరు కారకులు అని సాకులు వెతకడం అనవసరం. ఓటమి ఓటమే. భారత్‌పై పాక్ విజయాన్ని దాని అనుకోని భాగ్యంలాగా భావిస్తే ఆ జట్టు శ్రమను, దాని ఆల్ రౌండ్ ప్రతిభను అవమానపర్చినట్లే అవుతుంది. కానీ, గెలవాల్సిన గేమ్‌ను టీమిండియా పోగొట్టుకోవడంలో పాక్ ప్రతిభ ఎంత ఉందో టీమిండియా చేసిన ఘోర తప్పిదాలు కూడా అంతే స్థాయిలో కారణమని చెప్పాలి.  

విషాదకరమైనదేమంటే 2003 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియా చేతులో ఘోరంగా ఓడిపోవటానికి, అంతే ఘోరంగా ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీలో పాక్ చేతిలో ఓడిపోవడానికి  ఒకే అంశం కారణం కావడం గమనార్హం.
 
చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పరాజయం భారత వన్డే చరిత్రలో మరో పెద్ద ఓటమిని గుర్తుకు తెచ్చింది. ఆ మ్యాచ్‌ 2003 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌. ఇలాంటి పెద్ద మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించడంలో సహజంగానే చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ దానిని కాదని నాటి కెప్టెన్‌ గంగూలీ టాస్‌ గెలిచి కూడా ఫీల్డింగ్‌ తీసుకున్నాడు. పాంటింగ్‌ భారీ సెంచరీ, మరో రెండు అర్ధ సెంచరీలతో ఆసీస్‌ స్కోరు రెండు వికెట్లకు 359 పరుగులు. తొలి ఓవర్లోనే సచిన్‌ అవుట్‌తో భారత్‌ ఆశలకు కళ్లెం. అనంతరం పోరాడినా చివరకు 125 పరుగులతో పరాజయం.
 
నాడు కూడా దూకుడుగా ఆడి 82 పరుగులు చేసిన సెహ్వాగ్‌ రనౌట్‌. అన్నట్లు నాటి మన ప్రధాన బౌలర్‌ జహీర్‌ ఖాన్‌ 2 నోబాల్స్, 6 వైడ్‌లు వేస్తే ఈసారి బుమ్రా 3 నోబాల్స్, 5 వైడ్‌లతో సమంగా నిలిచాడు. ఛేదనల్లో 250 పరుగులు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న పాక్‌ బలహీనతను గుర్తించకుండా కోహ్లి తమ బలం ఛేజింగ్‌లోనే ఉందని నమ్మాడు. టాస్‌ గెలిచి తాను ఫీల్డింగ్‌ చేయాలనుకున్న నిర్ణయం అతడిని బహుశా చాలా కాలం వెంటాడవచ్చు!
 
టాస్ గెలిస్తే ఫీల్డింగ్ చేయాలనుకోవడం కోహ్లీ సొంత నిర్ణయమా లేదా టీమ్, యాజమాన్యం కలిసి తీసుకున్న నిర్ణయమా అనేది తెలియడం లేదు. కేప్టెన్ మాత్రమే తీసుకున్నా, లేక అది సమిష్టి నిర్ణయమే అయినా ఆ వ్యూహాత్మక తప్పిదానికి టీమిండియా తన చరిత్రలో మర్చిపోలేని ఫలితాన్ని కొని తెచ్చుకుంది