ఆదివారం, 12 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. గత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 12 జూన్ 2017 (01:39 IST)

విజయానికి, పరాజయానికీ మధ్య అడ్డుగోడ ధోనీయే.. తన సలహాలు ఎప్పటికీ విలువైనవే.. కోహ్లీ ప్రశంసలు

మైదానంలో ధోనీ సలహాలు టీమిండియాకు, వ్యక్తిగతంగా తనకూ ఎప్పటికీ విలువైనవే అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. అనుభవజ్ఞుడైన ధోనీ వంటి వ్యక్తి సలహాలు వెలకట్టలేనివని, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా తన సూచనలు జట్టుకు ఉపయోగపడతాయని కోహ్లీ ప

మైదానంలో ధోనీ సలహాలు టీమిండియాకు, వ్యక్తిగతంగా తనకూ ఎప్పటికీ విలువైనవే అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. అనుభవజ్ఞుడైన ధోనీ వంటి వ్యక్తి సలహాలు వెలకట్టలేనివని, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా తన సూచనలు జట్టుకు ఉపయోగపడతాయని కోహ్లీ ప్రశంసించాడు.  ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా సౌతాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.  మ్యాచ్ అనంత‌రం కోహ్లీ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ ధోనీ గురించి ప్ర‌స్తావించాడు. 
 
ధోనీ లాంటి అనుభ‌వ‌మున్న వ్య‌క్తి స‌ల‌హాలు వెలక‌ట్టలేనివని చెప్పాడు. మ‌హీ సుచ‌న‌లు ఏ ప‌రిస్థితుల్లోనైనా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని అన్నాడు. సఫారీలను చిత్తుగా ఓడించి టీమిండియా సెమీఫైనల్ చేరిన సమయంలో కూడా ధోనీ క్యాచ్‍‌లు, రనౌట్లతో ప్రత్యర్థి జట్టును భయకంపితులను చేశాడు.

పైగా సఫారీ బ్యాట్స్‌మన్ ఎఎల్ పెలుక్వాయోను ఎల్‌బిడబ్ల్యూ ఔట్ చేసిన సమయంలో ధర్డ్ అంపైర్‌కు రివ్యూ చేయమని కెప్టెన్ కోహ్లీకి మంచి సలహా ఇచ్చింది కూడా ధోనీయే. అందుకే బంతి విసిరిన బౌలర్ మాట కంటే రివ్యూ కోరేటప్పుడు ధోనీకేసి చూసి తన సలహా ప్రకారం నడుచుకోవడం కోహ్లీకి రివాజుగా మారింది. 
 
భార‌త బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ వేశార‌ని, సౌతాఫ్రికా జ‌ట్టుపై వాళ్లు క‌ల‌గ‌జేసిన ఒత్తిడి కార‌ణంగా తాము పైచేయి సాధించ‌గ‌లిగామ‌ని కూడా కోహ్లీ చెప్పాడు. ఈ విజయంతో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో దక్షిణాఫ్రికాను 2000, 2002, 2013, 2017లో ఓడించిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. గురువారం జ‌ర‌గ‌నున్న రెండో సెమీఫైన‌ల్లో భార‌త జ‌ట్టు బంగ్లాదేశ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.