గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : సోమవారం, 1 జులై 2019 (12:22 IST)

ఈ ప్రపంచ కప్‌లో తొలి బౌలర్‌గా.. తొలి బ్యాట్స్‌మెన్‌గా.. వారిద్దరే...

ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భారత క్రికెటర్లు రికార్డులపై రికార్డులు సృష్టిస్తున్నారు. భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పటివరకు మూడు సెంచరీలు బాదాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సైతం రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 102 పరుగులు చేశాడు. 
 
అలాగే, ఈ మ్యాచ్‌లో భారత పేసర్ మహ్మద్ షమీ కూడా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా, ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ పోటీల్లో ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 
 
జట్టు ప్రధాన ఓపెనింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయపడటంతో షమీ జట్టులోకి వచ్చాడు. అప్పటి నుంచి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఆప్ఘాన్ మ్యాచ్‌లో తొలి మ్యాచ్‌లో షమీ నాలుగు వికెట్లు తీశాడు. ఆ తర్వాత వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కూడా షమీ నాలుగు వికెట్లు కూల్చాడు. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులు ఇచ్చారు. మొత్తంమీద షమీ మొత్తం మూడు మ్యాచ్‌లలో 13 వికెట్లు పడగొట్టాడు. 
 
ఇకపోతే, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వరుసబెట్టి అర్థసెంచరీలు చేస్తున్నారు. భారత జట్టు ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడగా, వీటిలో ఒకటి వర్షం కారణంగా రద్దు అయింది. మిగిలిన ఆరు మ్యాచ్‌లలో బరిలోకి దిగిన కోహ్లీ.. ఐదు అర్థసెంచరీలతో రాణించాడు. ఒకే ప్రపంచ కప్‌లో ఐదు అర్థసెంచరీలు చేసిన భారత క్రికెటర్, కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.