శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : శుక్రవారం, 5 జులై 2019 (19:19 IST)

పాక్ 315 పరుగులు... అంటే బంగ్లాదేశ్ 7 పరుగులకే ఆలౌట్ చేయాలి... సర్ఫరాజ్ రిటైర్డ్ హర్ట్

పాపం సర్ఫరాజ్ చాలా బాధపడినట్లున్నాడు... అందుకే రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అతడు రిటైర్డ్ హర్ట్ ఎందుకయ్యాడో ఎవ్వరికీ తెలీక జుట్టు పీక్కుంటున్నారు. ఇకపోతే పాకిస్తాన్ సెమీఫైనల్లో ప్రవేశించేందుకు 500 పరుగులు చేస్తామన్నారు కానీ చివరికి 315 పరుగలు మాత్రమే చేశారు. 
 
ఈ పరుగులతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాలంటే బంగ్లాదేశ్ జట్టును 7 పరుగులకే ఆలౌట్ చేయాలి. మరి ఈ ఫీట్ పాకిస్తాన్ బౌలర్లు చేస్తారేమో... సర్ఫరాజ్ మ్యాజిక్ చేస్తారేమో... అని ఎదురుచూడాల్సిందే. ఏతావాత ఏంటంటే... ఇక పాకిస్తాన్-బంగ్లాదేశ్ జట్లు రెండూ తమ దేశాలకు వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కేయడమే మిగిలి వుంది.