సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : శుక్రవారం, 5 జులై 2019 (19:53 IST)

ఆ పరుగుతో పాకిస్తాన్ సెమీస్ ఆశ ఆవిరి... ఇంక ఇంటికెళ్లొచ్చు... న్యూజీలాండ్ కన్ఫర్మ్

పాపం సర్ఫరాజ్ అనుకున్నది జరగలేదు. 500 పరుగులు చేయాలనుకున్నప్పటికీ కేవలం 315 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జట్టును 7 పరుగులకే ఔట్ చేయాల్సిన పరిస్థితి. వాళ్లు చిచ్చరపిడుగుల్లా ఒక్క వికెట్ కూడా చేజార్చుకోకుండా ప్రస్తుతం 5 ఓవర్లకి 22 పగులు చేశారు. నిజానికి పాకిస్తాన్ ఆశలు 2వ ఓవర్లోనే ఎగిరిపోయాయి. ఇక ఏదో ఆడాలి కనుక ఆడుతున్నారు.
 
పాకిస్తాన్ పరిస్థితి ఇలా దిగజారిపోవడంతో సెమీ ఫైనల్లో బెర్తును న్యూజీలాండ్ కన్ఫర్మ్ చేసుకుంది. ఐతే న్యూజీలాండ్ జట్టుకి ప్రత్యర్థి ఇండియానా లేదంటే ఆస్ట్రేలియానా అన్నది తేలాల్సి వుంది. ఆస్ట్రేలియా, భారత్ ఇంకా చెరో ఒక మ్యాచ్ ఆడాల్సి వుంది. దీన్నిబట్టి ఎవరు ఎవరితో ఆడుతారన్నది తెలుస్తుంది. ఇకపోతే తమతమ మ్యాచులు ముగిశాక తమ దేశాలకు వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కేయడమే మిగిలి వుంది.