శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : మంగళవారం, 2 జులై 2019 (14:45 IST)

నిరుపయోగమైన మ్యాచ్‌లో రెచ్చిపోయారు.. పరుగుల వరద పారించారు

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా సోమవారం శ్రీలంక - వెస్టిండీస్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ ఇరు జట్లూ సెమీస్ నుంచి ఇప్పటికే నిష్క్రమించాయి. అలాంటి మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్లు రెచ్చిపోయారు. ఫలితంగా చెస్టర్ లీ స్ట్రీట్‌లో రెచ్చిపోయారు. 
 
ముఖ్యంగా, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా శ్రీలంక జట్టు అంతా అయిపోయాక అదరగొట్టింది. అలాగే, వెస్టిండీస్ బ్యాట్స్‌‌మెన్లు కూడా విశ్వసమరంలో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. ఒక దశలో 338 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేదించే దిశగా దూసుకెళ్లింది. చివరకు కీలక బ్యాట్స్‌మెన్ పూరస్, అలెన్‌లు ఔట్ కావడంతో పరాజయం తప్పలేదు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగులు చేసింది. ఇందులో ఆవిష్క ఫెర్నాండో 103 బంతుల్లో 2 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 104 పరులుగు చేయగా, కుషాల్ పెరెరా 51 బంతుల్లో 8 ఫోర్లతో 64 రన్స్, తిరిమన్నే 33 బంతుల్లో 4 ఫోర్లు 45 (నాటౌట్) చొప్పున రెచ్చిపోవడంతో ఆరు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు ఒక దశలో విజయం దిశగా సాగింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ పూరన్ 103 బంతుల్లో 11 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 118 పరుగులు, అలెన్ 32 బంతుల్లో ఒక సిక్స్, ఏడు ఫోర్లతో 51 రన్స్‌తో దుమ్మురేపారు. అయితే, చివరకు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగుల వద్ద ఆగిపోయింది. మొత్తంమీద ఈ మ్యాచ్‌లో 653 పరుగుల వరద పారింది.