మాంచెష్టర్ సెమీ ఫైనల్ : హమ్మయ్య మ్యాచ్ ప్రారంభం.... భారత టార్గెట్ 240

new zealand - india
Last Updated: బుధవారం, 10 జులై 2019 (15:24 IST)
ఇంగ్లండ్‌లోని మాంచెష్టర్ వేదికగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ మంగళవారం ప్రారంభమైంది. అయితే, కివీస్ ఇన్నింగ్స్ 46.1 ఓవర్ల వద్ద ఉండగా, వర్షం కారణంగా మ్యాచ్ రిజర్వు డేకు వాయిదాపడింది. దీంతో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగుల వద్ద నుంచి ఇన్నింగ్స్ ప్రారంభించింది.

అయితే బుమ్రా బౌలింగ్‌లో రవీంద్ర జడేజా వేసిన త్రోకు టేలర్ (74) రనౌట్ అయ్యాడు. ఆ తర్వత భువనేశ్వర్ బౌలింగ్‌లో 12 పరుగులు చేసిన నీషమ్, హెన్రీ (1)లు ఔట్ అయ్యారు. అప్పటికి కివీస్ స్కోరు 49 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఆ తర్వాత నిర్ణీత 50 ఓవర్లలో కివీస్ జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది.దీనిపై మరింత చదవండి :