1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 మే 2022 (21:09 IST)

మరో మోడల్ ఆత్మహత్య - 2 వారాల వ్యవధిలో నలుగురు బలవన్మరణం

suicide
ఎంతో భవిష్యత్ ఉన్న మర్థమాన మోడల్స్ వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో మోడల్ బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. దీంతో గత రెండు వారాల్లో నలుగురు మోడల్స్ ఆత్మహత్య చేసుకోవడం ఇపుడు కలకలం రేపుతోంది. 
 
తాజాగా 18 యేళ్ళ ఔత్సాహిక మోడల్ ఒకరు ఆదివారం తన గదిలో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈమె పేరు సరస్వతీ దాస్. బెంగాలీ మోడల్. ఆదివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో ఉరి వేసుకుంది. 
 
ఈ విషయాన్ని గమనించిన ఆ మోడల్ అమ్మమ్మ ఇరుగుపొరుగువారి సాయంతో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆమెను పరీక్షించిన వైద్యులు సరస్వతీదాస్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఇదిలావుంటే, గత రెండు వారాలుగా టెలీపారాలో వరుసగా జరుగుతున్న మోడల్స్ ఆత్మహత్యలు, మరణాలు కలకలం రేపుతున్నాయి. మే 15వ తేదీన గార్పాలోని ఓ ఫ్లాట్‌లో నటి పల్లవి ఆత్మహత్య చేసుకుంది. ఇపుడు సరస్వతీ బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపుతోంది.