మైనర్ బాలిక హత్యాచారంపై ఆందోళన
విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధి అగనంపూడి వద్ద ఇటీవల జరిగిన మైనర్ బాలిక పాండ్రంకి పావని మృతి కేసుపై న్యాయం జరగాలని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం, రూరల్ మండలాల రజక వృత్తిదారులు సంఘం నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రేవూరి గోగు రాజు, భీమవరం టౌన్ అధ్యక్షుడు చింతాడ శ్రీనివాస్ నేతృత్వంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రముఖ న్యాయవాది బేతపూడి లోకేష్ ప్రాంతీయ కార్యాలయం నుండి కొవ్వొత్తులు వెలిగించి పావని అమర్ రహే అంటూ నిరసన ర్యాలిని ప్రకాశం చౌక్ సెంటర్ వరకు నిర్వహించారు.
మృతి చెందిన మైనర్ బాలిక పావని కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రేవూరి గోగు రాజు, చింతాడ శ్రీనివాస్, కొత్తపల్లి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రజక మహిళలకు రక్షణ కరువైందని బాలిక మృతిపై. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు పోలీసులు చేపట్టిన సమగ్ర విచారణ నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బేతపూడి లోకేష్, దొమ్మేటి సుబ్బయ్య, నేదునూరి గంగాధరం తిలక్, కొత్తపల్లి వెంకటేశ్వరరావు, చిటికెల వాసు, లెఫ్ట్ బుజ్జి, గరగపర్తి మల్లేశ్వరరావు,, మావుళ్ళమ్మ రజక సంఘం నాయకులు, మారుతి నగర్ రజక సంఘం నాయకులు, రూరల్ మండలాల రాజకీయ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.