ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులు ఇవ్వలేదనీ భార్యతో కలిసి కుమార్తెను చంపేసిన తండ్రి...
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కుమార్తె పేరుపై ఫిక్స్‌డ్ చేసిన డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతో తన భార్యతో కలిసి కుమార్తెను హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే,
జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్‌గఢ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాలిక ఖుషి కుమారి (17) ఈ నెల 13వ తేదీన తన గదిలో ఉరేసుకున్న స్థితిలో కనిపించింది. ఉరికి వేలాడుతున్న సోదరిని చూసిన ఆమె సోదరుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన రూ.6 లక్షలు ఇవ్వనందుకు తన తండ్రి, సవతి తల్లి కలిసి ఆమెను చంపేశారని ఆరోపించాడు. ఫిక్స్ చేసిన ఆ సొమ్ము త్వరలోనే మెచ్యూర్ కావాల్సివుంది.
ఈ విషయం తెలిసిన వందలాది మంది గ్రామస్థులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నిందితులను అరెస్టు చేశారు. కాగా, దీనిపై కేసు నమోదన పోలీసులు విచారణ జరుపుతున్నారు.