ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2022 (09:08 IST)

ప్రియుడితో సరసాలు.. అడ్డుగా వున్న భర్తను హత్య చేయించిన ఎస్ఐ భార్య

crime scene
వివాహేతర సంబంధాల కారణంగా నేరాలు పెరుగుతున్నాయి. తాజాగా తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మాజీ పోలీస్ కానిస్టేబుల్ కిరాయి గుండాలతో హత్యచేయించిన ఘటన తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. కిరాయి గుండాలతో మాజీ పోలీసు కానిస్టేబుల్‌ను అతని భార్య ఎస్ఐ ఈ ఘాతుకానికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
 
వివరాల్లోకి వెళితే.. కృష్ణగిరి, ఊత్తంగరై జిల్లా కల్లాలికి చెందిన సెంథిల్ కుమార్ (48) పోలీస్ కానిస్టేబుల్. ఇతని భార్య చిత్ర ఎస్ఐ. ఈ ఏడాది సెప్టెంబర్ 16న సెంథిల్ కుమార్ కనిపించకుండా పోయాడు. 
 
పోలీసుల విచారణ మేరకు భార్య ఎస్ఐ బాగోతం బయటపడింది. తన వివాహేతర సంబంధానికి సెంథిల్ అడ్డుగా వున్నాడని చిత్ర భర్తను కిరాయి ముఠాతో హత్య చేయించినట్లు తేలింది. ఈ ఘటనలో ఆమెతో పాటు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో వున్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.