ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (08:28 IST)

ఏసు క్రీస్తు వల్లే కరోనా వైరస్ లేకుండా పోయింది : తెలంగాణ హెల్త్ డైరెక్టర్

srinivasa rao
తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు మరోమారు వార్తలకెక్కారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కి పత్రిలకెక్కిన ఆయన తాజాగా మరోమారు వార్తల్లో నిలించారు. ఏసు క్రీస్తు వల్లే కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిందని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత రెండున్నరేళ్లుగా కరోనా వైరస్ మానవజాతి మనుగడను ప్రశ్నార్థకంగా మార్చివేసిందన్నారు. ప్రపంచ మానవాళిని కోవిడ్ తీవ్రంగా భయపెట్టిందన్నారు. ఇపుడు దాని నుంచి పూర్తిగా విముక్తి కలిగిందని చెప్పారు. దీనికి కారణం ఏసు ప్రభువన్నారు. 
 
"మనం అందించిన వైద్య సేవలతో కాదు.. ఏసు క్రీస్తు కృప వల్లే కరోనా వ్యాప్తి తగ్గింది. మంచిని ఆచరించాలని, మంచిని ప్రేమించాలని, మంచిని గౌరవించాలని చెప్పే మిగిలిన అన్ని జాతుల, ధర్మాల ప్రబోధాలను మనమందరం ముందుకు తీసుకుపోవడం వల్ల మానవజాతిని కాపాడుకోగలిగాం. మనిషిగా పుట్టేందుకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు" అని శ్రీనివాసరావు అన్నారు.